Tuesday 6 April 2021

వెన్నెల స్నేహం

నవ్వుల కలలు కలసికట్టిన ఘడియలు 

మనసున మాటలు మరల చెప్పిన ఊసులు 

ఎన్నెన్నో సంగతులు 

మరెన్నో తలపులు 


వెండికుంచెతో గీచిన స్నేహ చిత్రం 

వ్యధల కూడికను వదులు చేసింది 

నేనున్నానన్న ఆత్మీయత 

నవ్వును జీవితాన మొలకలెత్తించింది 


హాయి హాయిగా జారిన స్మృతులు 

మనసున నింపెను ప్రేమ అలలు 

వేచి చూచిన మధురఘడియలు 

ప్రతిక్షణము పులకింపజేయఁగ 


చల్లని గాలుల చక్కిలిగింతలపై 

మైమరిచి అనుభవించితిని 

      "నీ వెన్నెల స్నేహం "           


Wednesday 15 July 2020

తెలివి దివిటి

ఊహతెలిసిన తర్వాత వెతికి వెతికి చూసాను
అమ్మ కొంగనుకొని భ్రమపడి ఏడ్చాను

పరిగెత్తి పరిగెత్తి నాన్న వేలి కోసం
అర్రులు చాచి అలసిపోయాను

అమ్మానాన్న ప్రేమ లేని ఎదవ జీవితం
ఎందుకని పారేయబోతే  వెర్రి స్నేహమొకటి వెనక్కి లాగింది

ఉండదన్న అనుమానం కొండంత ఉన్న
ఉంటేబావుందన్న ఆశ ఊరు దాటింది

చెయ్యివేసి నడిచిన స్నేహం చెయ్యి నరికిన వేళ
చెప్పుదెబ్బల మోము రక్తమోడింది

ప్రేమ అంటూ సాకిన ప్రణయ బంధం
బ్రతుకు ముచ్చట్లతో వేదనాపింది

తెల్లవారుతందని తలచేడంతలో
మరొక బ్రతుకు  బాగుందని మరలిపోయింది

కొడుకు "లాగ " అని చెప్పే లంజకొడుకులందరూ
కోసుకు తిని వదిలేసిపోయారు

తల్లిని అని చెప్పే పుణ్యమాతలెందరో
చాటున మాటేసి వాడేసుకున్నారు

తప్పెవడిది కాదని ఎరుక వచ్చినాక
పిచ్చ నా కొడుకునై మిగిలిపోయాను

మొదలు అంతములు ఒకటే కాగా
మధ్య తీరిన దూల మాడబెట్టింది

దొరకదన్న బాధ దిగమింగి బాగా
లేదన్న రంగు పూసుకున్నాను

ప్రేమ అన్న మాట పూడ్చిపెట్టి
ప్రేమస్వరూపులకు పాడె కట్టాను

బ్రతుకు ఒంటరిదని బుర్ర వెలిగి
తెలివి దివిటి చేతబట్టి   బ్రతకనేర్చాను

-క మ ర