వ్యధల వధలతో వడిలిపోయిన వెర్రి మనసు
ముడతల ముసుగులో దాగిన మాసిన మోము
దాక్కుని తిరిగిన వదలని చిత్తము
ఆపుకు అరిచిన ఆగని దుఃఖము
ఎవడు లేడంటు బుర్రెoత చెప్పిన
వినని మనసుకిపుడు తాట లేచింది
ఒల్లుకుళ్లబొడిచే అరిగిన ఎముకలు
చేసిన చేష్టల చెప్పు దెబ్బలై
తోసిన తప్పులు తిప్పలు పెట్టగ
నొసటన చెయ్యి మరి మరి బాదగా
మంచిమిత్రులను ముంచిన తీరు
నను నేను చూస్తే ఆగని కన్నీరు
బలమున్నంత వరకు నేనే రాజంటు
బలుపు తీరాక బాధలేనంటూ
ఏడ్పుగొట్టు బ్రతుకయ్యిందని ఏడ్చి ఏడ్చి
మొదటి నుండి ఉన్న ప్రకృతి వంక చూసి
ఎదో ఒకటి చేసి ఈ గురుతు యాతన తీర్చమని
దీనంగా అర్థించిన కనులకు
పడగలు విప్పి పురులని దాల్చి
వేప మండల గాలులు రేపి
ఎలుగెత్తి ఒక పాటున నింగి విరిచి
ఒసగినది ఈ మరణ వరం
--క మ ర
No comments:
Post a Comment