కనులు తెరిచి చూసాను నీవెవరని
మసకను మాపి తెలిసాను నేనున్నది నీలో అని
నా రంగు నాకు తెలియదు నీ రంగు తెలుపు
నా ఉనికి నాకు తెలియదు నీ ఉనికిని మరవలేను
నీతో కదులుతూ ఈ గాలి ఊపులని ఆస్వాదిస్తూ
ప్రతి క్షణము ఉప్పొంగి పోయాను, ప్రతి ఊసుని చల్లగా మదిలో దాచాను
ఆ చల్లదనం పెరిగింది .. నీ రంగు మారింది
దూది పింజలాంటి నువ్వు కాళ రాత్రిలా మారావు
మల్లె పువ్వులాంటి నీ నవ్వు ఉగ్ర గర్జనగా మారింది
ఓర్పుతో పట్టుకునే నువ్వు ఉడుములా ఒడిసి పట్టావు
నీ పట్టుకి భయం వేసింది నీ వేగం నన్ను వణికించింది
నీ లోని కల్లోలం ఒక అన్తఃర్మధనాన్ని తలపించింది
మెడ పట్టి తోసారా అన్నట్టు నన్ను బయటకి తోసావు
స్వాతి చినుకునై నీ చేయి విడి జారాను నేను
నీ నుంచి విడినందుకు వెక్కి వెక్కి ఏడ్చాను
కన్నీళ్ళ తో కలిసి కిందకి జారాను
గాలికి పొర్లుతూ నిను నేను చూసాను
కరిగిపోతున్న నీ దేహాన్ని చూసి కలత చెందాను
భూమిని తాకాను చెట్టును తాకాను
ప్రకృతిని ఆస్వాదించే మనిషినీ తాకాను
ఆ జోరుకు భయపడుతున్న జంతువులను తాకాను
నా పయనమెటో తెలియక సతమతమయ్యాను
ఒక చోట జారి జారి ఇలలోకి ఇమిడి పోయాను
మరొక చోట పారి పారి నది లోకి కలిసిపొయాను
ఒక సారి పరిగెత్తి పరిగెత్తి వాగు లోకి దూకాను
మరొకసారి అలసి సొలసి బాటలోనే మిగిలాను
నినువీడి ఉండలేక
ఎడబాటు భరించలేక
పరిగెత్తి చేరాను నదుల ఒడిలో
వడివడిగ కలిసాను అలల కౌగిట్లో
మరిగితే కాని నిను చేరలేనని తెలిసి
మధ్యన రావొద్దని నిను బ్రతిమలాడి
ఒళ్లారబోసాను రవి కిరణ వేడికి
ఎంత ఆశో మరొకసారి దొరికేనేమో నీ సన్నిధి
మరిగి మరిగి ఆవిరయ్యను
నీ లాంటి ఒడిలో ఒదిగి పోయను
నీలాగ ఉన్న నీవు కాదని తెలుసు
మళ్ళీ ఈ ఆట మొదలయ్యిందని తెలుసుకున్నాను
ఎప్పటికి నిను చూసేనో ఎన్నటికి నిను కలిసేనో
నేను నీకు ఎరుకో లేదో , కానీ
నీ ప్రేమ నే మరువలేను నీ ఉనికి నే దాటలేను
నీ దరి చేరే దాకా ఈ పయనం సాగిస్తూ వేచి చూస్తాను
ఉంటానూ ........

No comments:
Post a Comment