అరమరికలు లేని అలవాట్లు చేసుకుని
దాపరికములు లేని జీవనశైలి నేర్చుకుని
మనసును మాటగా
మంచి మాట మనసుగా మారాలని
బుద్ధి మాలిన మనకు మనమే తెలువాలని
నీతిలేక మనము నీరసపోతున్నామని
అందరు అంతే అని సర్దుకుపోతున్నామని
మనకి మనమే నచ్చకుండా పోతున్నామని
తెలిసి తెలిసి బ్రతికేస్తే బ్రతుకు తెలియకపోతామని
ఇకనైనా మామాసు మాటలువిందామని
మనకు మనం తెలుసుకుందామని
మంచి కోసం ముందుకెడదామని
మీతో నేనున్నాననీ ...
తెలుపుతూ తెలుసుకుంటూ
ఈ దీపాల ఆవలి మన మలినం మాడ్చాలని కోరుకుంటూ.
-క మ ర
No comments:
Post a Comment