రంగు కాగితము కప్పినా రంకు తనము
బాగ దాచిపెట్టినా బొంకు తనము
నిజము నిప్పన్న మాట పెడచెవిన పెట్టినా
నీయందు నిప్పు నిజము నిజము
నిదురలో నిను వలుచు
కలలలో కడతేర్చు
లేచి ఉన్నంత వరకు మరచేల మభ్యపెట్టు
తరగనిదా దూరము
మరపు రానిదా రూపము
అద్దమందు నిను చూడనివ్వదు
నీనుంచి నిను దాటి పోనియ్యదు
నీవన్న నిప్పు నిను కాల్చ సాగును
తలపులమ్మట తల బద్దలయ్యేను
కపాల మోక్షమని పైకి బొంకేవు
నీ పాపాలకు యమపాశ దెబ్బని తెలిసి ఏడ్చేవు
చచ్చినాక నిను కాల్చ అగ్గి సిగ్గుపడేను
నీ అస్థికలు కలుపగా జలము తల్లి ఏడ్చేను
నీ కుళ్ళు కంపు మోయ వాయువే వాలేను
నిను నేను కనలేదని పుడమి అబద్ధమాడేను
నిను తన కింద చూచి గగనమే చీలేను
పంచ భూతములను ఏడిపించిన పిచ్చనా కొడుకువై నీకు నీవు తెలిసి చచ్చేవు
No comments:
Post a Comment