Wednesday, 7 December 2016

కొడవలి - ఒరవడి

మారే బ్రతుకులు మారని మనుషులు
మట్టిని అమ్మి మాయని చల్లి
రంగులు మార్చే తీరును నేర్చి
మాటతొ  ముంచి మోటుగ తెంచి

మహిమని చెప్పి పిచ్చిని పామి
వాతలు తేల్చి  రాతను మాపి
కోతలు కోసి కోరలు చూపి
మనిషని చూడక కత్తులు దింపి

రక్తము కారాగ దాహములాపి
మనిషే చావగ మాంసము మరిగి
చీల్చిన  బ్రతుకును నెత్తిన మోసి
వచ్చే వాసన పక్కకు నెట్టి

ముక్కులు మూసి ప్రక్కలు త్రొక్కి
పిచ్చి కుక్కలా ఫోజులు కొట్టి
వెర్రివేషాలతో వెంపర్లాడే
మదమెక్కిన కక్కుర్తి జీవుల తనువులు నరికే

ఆ కొడవలి కావలి నీ స్త్థెర్యం ... నీ  ఒరవడి కావలి జాతికి మార్గం

వస్తున్నావని ఆశిస్తూ  ... కడ  తెరుస్తావని ఎదురు చూస్తూ ...

-క మ ర

Sunday, 30 October 2016

మలినము మాడ్చాలి దీపావళి


అరమరికలు లేని అలవాట్లు చేసుకుని
దాపరికములు లేని  జీవనశైలి నేర్చుకుని
మనసును మాటగా
మంచి మాట మనసుగా మారాలని

బుద్ధి మాలిన మనకు మనమే తెలువాలని
నీతిలేక మనము నీరసపోతున్నామని
అందరు అంతే అని సర్దుకుపోతున్నామని
మనకి మనమే నచ్చకుండా పోతున్నామని

తెలిసి తెలిసి బ్రతికేస్తే బ్రతుకు తెలియకపోతామని
ఇకనైనా మామాసు మాటలువిందామని
మనకు మనం తెలుసుకుందామని
మంచి కోసం ముందుకెడదామని

మీతో నేనున్నాననీ ...

తెలుపుతూ  తెలుసుకుంటూ

ఈ దీపాల ఆవలి  మన  మలినం మాడ్చాలని కోరుకుంటూ.

-క మ ర