Wednesday 7 December 2016

కొడవలి - ఒరవడి

మారే బ్రతుకులు మారని మనుషులు
మట్టిని అమ్మి మాయని చల్లి
రంగులు మార్చే తీరును నేర్చి
మాటతొ  ముంచి మోటుగ తెంచి

మహిమని చెప్పి పిచ్చిని పామి
వాతలు తేల్చి  రాతను మాపి
కోతలు కోసి కోరలు చూపి
మనిషని చూడక కత్తులు దింపి

రక్తము కారాగ దాహములాపి
మనిషే చావగ మాంసము మరిగి
చీల్చిన  బ్రతుకును నెత్తిన మోసి
వచ్చే వాసన పక్కకు నెట్టి

ముక్కులు మూసి ప్రక్కలు త్రొక్కి
పిచ్చి కుక్కలా ఫోజులు కొట్టి
వెర్రివేషాలతో వెంపర్లాడే
మదమెక్కిన కక్కుర్తి జీవుల తనువులు నరికే

ఆ కొడవలి కావలి నీ స్త్థెర్యం ... నీ  ఒరవడి కావలి జాతికి మార్గం

వస్తున్నావని ఆశిస్తూ  ... కడ  తెరుస్తావని ఎదురు చూస్తూ ...

-క మ ర

Sunday 30 October 2016

మలినము మాడ్చాలి దీపావళి


అరమరికలు లేని అలవాట్లు చేసుకుని
దాపరికములు లేని  జీవనశైలి నేర్చుకుని
మనసును మాటగా
మంచి మాట మనసుగా మారాలని

బుద్ధి మాలిన మనకు మనమే తెలువాలని
నీతిలేక మనము నీరసపోతున్నామని
అందరు అంతే అని సర్దుకుపోతున్నామని
మనకి మనమే నచ్చకుండా పోతున్నామని

తెలిసి తెలిసి బ్రతికేస్తే బ్రతుకు తెలియకపోతామని
ఇకనైనా మామాసు మాటలువిందామని
మనకు మనం తెలుసుకుందామని
మంచి కోసం ముందుకెడదామని

మీతో నేనున్నాననీ ...

తెలుపుతూ  తెలుసుకుంటూ

ఈ దీపాల ఆవలి  మన  మలినం మాడ్చాలని కోరుకుంటూ.

-క మ ర 

Friday 21 October 2016

నువ్వు చెయ్యలేని మోసము


రంగు  కాగితము కప్పినా రంకు  తనము 
బాగ దాచిపెట్టినా బొంకు తనము 
నిజము నిప్పన్న మాట పెడచెవిన  పెట్టినా 
నీయందు  నిప్పు నిజము నిజము 


నిదురలో  నిను వలుచు 
కలలలో  కడతేర్చు 
లేచి ఉన్నంత వరకు మరచేల మభ్యపెట్టు 


తరగనిదా దూరము 
మరపు రానిదా రూపము 

అద్దమందు నిను చూడనివ్వదు 
నీనుంచి  నిను దాటి పోనియ్యదు 


నీవన్న నిప్పు నిను కాల్చ సాగును 
తలపులమ్మట  తల బద్దలయ్యేను 
కపాల  మోక్షమని పైకి బొంకేవు 
నీ పాపాలకు యమపాశ దెబ్బని తెలిసి ఏడ్చేవు 

చచ్చినాక నిను కాల్చ అగ్గి సిగ్గుపడేను 
నీ అస్థికలు కలుపగా జలము తల్లి ఏడ్చేను  
నీ కుళ్ళు కంపు  మోయ వాయువే వాలేను 
నిను నేను కనలేదని పుడమి అబద్ధమాడేను 
నిను తన కింద చూచి గగనమే చీలేను 


పంచ భూతములను ఏడిపించిన పిచ్చనా కొడుకువై  నీకు నీవు తెలిసి చచ్చేవు 

Thursday 28 July 2016

కడుపు మంట ... కెలకకంట ...నీకే తంట ..


ప్రపంచంలోకి  ఏదన్న కొత్తది బాగా కసిగా   రావాలి అంటే ఎవడో ఒకడికి బాగా కాలాలి ... 

అంతగా కాలాలి అంటే  వాడిని ఎవడో భీభత్సంగా కెలకాలి 


అలా కెలికే వాడి గ్రహచారం గ్రహాలకే చిరాకు వచ్చేలా  ఉండాలి 


ఇంత జరిగితే గాని ఒక సమర్థవంతమైన బద్ధకస్తుడు జిడ్డు వదిలించుకుని ముందుకెళ్ళడు 


కెలికే వాడు పాపి/వెధవో  అయితే వాళ్ళు ఉన్నది మంచికే 

అవసరానికి అవసరమొచ్చే ఈ కాలంలో సమర్థవంతులు తమంతట తాము నిద్రలేస్తే మంచిది 

లేకపోతే పాపులు రావలిసిందే  మిమ్మల్ని కెలకాల్సిందే ... Choice  is Yours 



అందుకే పాపి చిరాయువు అన్నారేమో పెద్దలు 

పాపులకు దరిద్రులకు  చండాలులకు నా కృతజ్ఞతలు ... 

--కమర
(కడుపు మండిన రచయిత )


Thursday 12 May 2016

నీలి మబ్బు - స్వాతి చినుకు

కనులు తెరిచి చూసాను నీవెవరని
మసకను మాపి తెలిసాను నేనున్నది నీలో అని

నా రంగు నాకు తెలియదు నీ రంగు తెలుపు
నా ఉనికి నాకు తెలియదు  నీ ఉనికిని మరవలేను
నీతో  కదులుతూ ఈ  గాలి ఊపులని ఆస్వాదిస్తూ
ప్రతి క్షణము ఉప్పొంగి  పోయాను, ప్రతి ఊసుని చల్లగా మదిలో దాచాను


ఆ చల్లదనం పెరిగింది .. నీ రంగు మారింది
దూది  పింజలాంటి నువ్వు కాళ  రాత్రిలా  మారావు
మల్లె పువ్వులాంటి  నీ నవ్వు ఉగ్ర గర్జనగా  మారింది
ఓర్పుతో  పట్టుకునే నువ్వు ఉడుములా  ఒడిసి  పట్టావు


నీ పట్టుకి  భయం వేసింది నీ వేగం నన్ను వణికించింది
నీ లోని కల్లోలం  ఒక అన్తఃర్మధనాన్ని తలపించింది
మెడ పట్టి తోసారా  అన్నట్టు నన్ను బయటకి తోసావు
స్వాతి చినుకునై నీ చేయి విడి జారాను నేను


నీ నుంచి విడినందుకు  వెక్కి వెక్కి ఏడ్చాను
కన్నీళ్ళ తో కలిసి కిందకి జారాను
గాలికి పొర్లుతూ నిను నేను చూసాను
కరిగిపోతున్న నీ దేహాన్ని చూసి కలత చెందాను

భూమిని తాకాను  చెట్టును తాకాను
ప్రకృతిని ఆస్వాదించే మనిషినీ   తాకాను
ఆ జోరుకు భయపడుతున్న జంతువులను తాకాను
నా పయనమెటో తెలియక సతమతమయ్యాను

ఒక చోట  జారి జారి ఇలలోకి ఇమిడి పోయాను
మరొక చోట పారి పారి నది లోకి కలిసిపొయాను
ఒక సారి పరిగెత్తి పరిగెత్తి  వాగు లోకి దూకాను
మరొకసారి అలసి సొలసి   బాటలోనే    మిగిలాను

నినువీడి ఉండలేక
ఎడబాటు భరించలేక
పరిగెత్తి చేరాను నదుల ఒడిలో
వడివడిగ కలిసాను అలల  కౌగిట్లో

మరిగితే కాని నిను చేరలేనని తెలిసి
మధ్యన రావొద్దని నిను  బ్రతిమలాడి
ఒళ్లారబోసాను రవి కిరణ  వేడికి
ఎంత ఆశో మరొకసారి  దొరికేనేమో  నీ సన్నిధి

మరిగి మరిగి ఆవిరయ్యను
నీ లాంటి ఒడిలో ఒదిగి పోయను
నీలాగ ఉన్న నీవు కాదని తెలుసు
మళ్ళీ ఈ ఆట మొదలయ్యిందని తెలుసుకున్నాను


ఎప్పటికి నిను చూసేనో ఎన్నటికి నిను కలిసేనో
నేను నీకు ఎరుకో లేదో , కానీ
నీ ప్రేమ నే  మరువలేను నీ ఉనికి నే దాటలేను
నీ దరి చేరే దాకా ఈ పయనం సాగిస్తూ  వేచి చూస్తాను

ఉంటానూ ........


Monday 4 April 2016

"నా"

అమ్మ నాది నాన్న నాది అని మొదలెట్టిన ఆట 
తాత ఎవరిది అనే ఘడియ దగ్గర ముగుస్తోంది 

ఇది నాది అని ఆనందించిన రోజులూ ఉన్నాయి 
"నా " ఎవరు లేరు అని ఏడ్చిన రోజులూ ఉన్నాయి 

వేదాంతం చదివితే "నా   ఆస్తి" అహంకారం అంది 
"నా తోడు " మమకారమంది 
జీవితం చూస్తే "నా ఆస్తి " ప్రేమ అంది 
"నా  తోడు " స్నేహమంది 

పడుకునేలోపు ఏం  గోల చేస్తవులే నేస్తం 
ఇవ్వాళా మూసినా కన్ను ఒక రేపున తెరువలేవు 
ఇవ్వాలి ఆపిన  మాట ఆ రోజు పూర్తి చెయ్యలేవు 
ఆ రోజు తర్వాత విలువలేని ఆస్తులు తీరని అప్పులే నిన్ను గుర్తుకు తెస్తాయి 

ఇదా నా జీవితం,  ఒక రోజు ఇలా ఉంటుంది 
అని తెలిస్తే  ముందు రోజే నవ్వే వాడిని కదా అనిపిస్తుంది 
వీళ్ళకు ఇక నేను లేను అన్న బాధ కంట తడి పెట్టిస్తుంది 
ప్రపంచం నీ గురించి ఏమనుకుందో నీకే ఎరుకకు వస్తుంది 

కాని నాకు తెలుసు నేస్తం  నువ్వు "నా " "నా "
అని ఎందుకన్నావో 
అది మమకారం కాదు ఒంటరితనం అని నాకు తెలుసు 
ఎవరోఒకరు నిన్ను "నా " అంటారన్న  నిరీక్షణ  అని నాకు తెలుసు 

ఎన్ని రాత్రులు లేచావో ఎన్ని  మాటలు దాచావో 
ఎన్ని ఊసులు పేర్చావో ఎంత కన్నీరు కార్చావో 
చూస్తూనే ఉన్నా నేస్తం చూస్తూనే ఉన్నా 
ఎమీ తోచక ఆలోచిస్తున్నా 

నాతో ఈ సహవాసం ఈ క్షణమైనా 
మల్లీ నువ్వు "నా " అని వెతికే  లోపు 
ఒంటరితనాన్ని నాతో పంచుకో నేస్తం 
నన్ను  నా అనుకో నేస్తం ...... 

Tuesday 15 March 2016

bas thu chota hi reh

bada hoga tho tereko lagega thu shaandar banega
tera battery car nahin Honda ki civic rahegi tere haath mein

jab bhi baahar jaayega thu apna card swipe karega..
aur ghar aaye guests joh tofa denge.. woh tera actual purse mein jaayega

tere dost log tereko milne gaadi pe aayenge
tereko saath leke jaayenge raath ko late tak gappe marenge..

office ke party hogi toh bahut masti hogi
colleagues ke saath nachega..thode logon ke saamne hero banega..
ek do awards lega stage pe jaake...

yaar sunle baath...

ye duniya eise hi nahin dene waali ye sab..

har ek taali ke sound ke peeche rahega ek asoon tera
har ek masti ke peeche ek jor ka jhatka..

jis ka saath leke shuru hothe hon...
aadhi doori ke baad pehchaan nahin ppaoge..


tera har ek manjil ke peeche rahega tera akelapan ka story

kabhi kabhi lagega yaar  papa ne ye sab kyon nahin bola..

aur dard hoga tho lagega yaar bhagwan dikhte kyon nahin..
 kandha tho do yaar jindagi mushkil hogayi he

woh purane hindi gaane bahut sense banne lagegi..

aur ye bologe.. "old is gold.."


dhire dhire aage badega aur zindagi samjhayegi..toh eisa hi kuch likheka..

isiloye bol rahan hoon yaar ani..

bas thu chota hi reh.. yaad rakhle bas thu chota hi reh

Wednesday 9 March 2016

Pyaar Hotha he

Jab chote thein..

Pyaar Tho woh cheez thi
jab papa ko tang kar ke doosra choclate lethe the..
Mummy ko mana karke raath ko bhi khelne jaathe the..


Hostel mein gaye

tho ghar ka khana ka value patha chala
tab samajh mein aayi baath..
restaurant ke dish mein ingredients hothe hein..
ghar ke khaane mein mummy ka pyaar hotha hein..

shaayad isiliye har kisi ko apni mummy ka haath ka khaana pasand he :)

you see.. home food is awesome :)


Naukri Lagi

Toh Samajh mein aaya papa gussa kyon hothe the :)
kyon kharchon ko lekar mummy ka class lethe the..
kyon mereko jabardasti study hour pe bhejthe the..
mere success ke peeche woh itna kyon pade the..

haan wo bhi jamana tha..

jab pyaar bole toh DDLJ yaad aatha tha..
khud sharukh ban jaathe the and Kajol ko dhoondthe the..
is search mein tho apne dost log tho google ke barabar the..
yaar isko dekho.. woh kaisi lagi.
naam bina jaane hi rishtha jod the the..
woh teri baabhi he..Tum log bhi cartton the yaar.. kabhi kabhi
is template rishton ko serious lethe the..

in sab mein jo doston ka pyaar tha.. woh samjh aaya..

Saare dekhne ke baad tho yahi lagtha hein..

Dimaag ko bada hi rehne do..
ek baar dil chotha hojaye..bachpanaa kare.

Papa ke saath wohi khel khele jo bachpan mein khela karthe the..
mummy ko waise hi sathaaye..
Ek hi sun glassess ko leke sare dost log phot kheenchen .. lol..

but yaar dil ek batha.. agar koi ye sab nahin dekha tho.. Uskeliye Pyaar Kya hotha he ?

"Pyar Hotha he Ki..?"

Monday 22 February 2016

Woh Bhi Kya Din The




Wo bhi kya din the..

Papa ka morning walk ka saath dena
Wo reason leke lauthe time choclate milk keliye dad ko mananaa…

Wo bhi Kya din the…

Market mein nikle nayi pencil keliye rona..
Jab papa leke aathe the tho usi ke saath sona…


Wo bhi kya din the…

Subah se shaam thak cricket khelna
Raath ko papa ke haathon maar khaana..
Rulathe bhait gaye tab mummy pyaar se khana khilana
Bade bhai ki who reluctant hasi aur mamma ka response..
 
Wo bhi kya din the..

Papa ke jeb se 10 rupay uthana
Ek choti choclate khareedke papa kohi dena
Paise kahan se aaye.. Dialog ko silent response dena..
Finally sach bolna.. Rothe rothe mummy ke saath sona..

Wo Bhi kya din the..

Summer mein cousins ka wait kar na
Subah raath bhagam doud karna..
Ghar pe video games rent karna..
Poora ghar movie theatre ban jaana…

Wo Bhi Kya Din the…


Yaar "Wo Bhi Kya Din The"
Life mein tho kabhi aaya nahin..
Ek baar sapne mein tho aaja yaar … please…
Bahut miss kar rahan hoon…