Monday 15 May 2017

ఏ మనిషి చరిత్ర చూసినా


ఏ మనిషి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
ప్రతి వాడి గోడు సమస్తం పర పీడన, ఆలసత్వం


ఏడుపులు పెడ బొబ్బలనడుమన చిరునవ్వులు
నలిగే నరముల మధ్యన  మందుల ముచ్చట్లు
వెనుక చూచినా పరుల దుమ్మే
ముందు చూచినా  పరుల ఉమ్మే

నచ్చక మనసొప్పక
జీవనమే తలతిక్కని
తప్పించేవాడెవడని
పనులను పక్కకి పెట్టి

తనులను మరపున పట్టి
తెగ పీకి ఇరగతీద్దామని
ఇక తీరా ఆరా  తీస్తే
అసలు సొట్ట తెలిసింది

జబ్బు నా యందు జాడ్యమని
నాకున్న బుర్ర వాడనని
వాడెవడో పెడతాడని  వీడెవడో పొడుస్తాడని
అర్రులు చాచి బ్రతుకుతున్నానని


బుద్ధి మాంద్యము వదిలే దాకా
సుత్తి దెబ్బలు  మోహమునేసుకుని
కంపు చరిత్రను తగులబెట్టి
తెల్ల కాగితము చేత బట్టి

నన్ను నమ్ముకుని  శాయశక్తుల
వడలు వంచితె అన్ని వేళలా ...

మారబోదా  బురద రంగు
వదిలి పోదా మకిలి నన్ను
తెలవారెను హృదయమందు
దరికి చేరేను  జీవితంబు

--క మ ర

"మనో వాంఛా ఫల సిద్దిరస్తు"


"గద్దె కొరకే గాడిది కొడుకులు గత్తర లేపురు రా" అన్నదొక మేటి యాంకర్
"వీడా నాకొడుకని గాడిద ఏడ్చెన్" అన్నాడొక మహా కవి


ఒక తల్లి పడే బాధ నిజంగా తెలిసిన వాడెవడూ తప్పులు చెయ్యడు
తెలిసి చేసేవాడు తన కొడుకు అని భరించలేక "గాదిద కొడకా"
అన్న పదం కనిపెట్టిన మాతృమూర్తికి నా నమస్కారం.

చెప్పు దెబ్బలు తిన్నా
ఆ దుమ్ముని ఫేషియల్ గా పూసుకుని
ఆ కంపులో ముక్కు మూసుకుని ఇంకొన్ని ఎదవ పనులు చేసే
ఆ జీకేలకు నా ఆశీర్వాదం

"మనో వాంఛా ఫల సిద్దిరస్తు"
మీ మెదడులో మీ గురించి కూడా మంచి రాదు
సో ఆశీర్వాదం వర్కౌట్ అవుతుంది.

అవతల వాడిని ఏడిపించి ఏడిపించి
నిన్ను నువ్వు కూడా ఏడిపించుకుంటూ
నీ వాళ్ళను ఏడిపిస్తూ
బతుకుతున్న దిక్కుమాలిన జీకేలకు
ధాత్రిభ్రంశ  యోగం కలగాలని కోరుకుంటూ....!!!

క.మ.ర. 

Wednesday 10 May 2017

మనసున దించిన మేకులు

 రంగు రంగుల మేకులు ఎన్నో 
కలిసి వచ్చేది ఎందుకనో 


ఒకటేమో నీలము మరొకటి ఎరుపు 
ఇంకొకటి పసుపు దాని వెనకాలిది పచ్చ 

ఏ మేకు చూసినా  పదునే 
ఏ వైపు చూసినా చదునే 
నమ్మమని అడగవు 
నమ్మేదాకా వదలవు 


ఒడిసి పట్టు కాదనను 
ఆనించి  పెట్టు గుచ్చను
వంచి చూడు బెసకను 
కదిలించి చూడు తొణకను 


సొల్లు మాటలు సాన చెప్పి 
సొల్లు కారుస్తూ వెంటే తిరిగి 
సూపర్ నువ్వు డూపర్ నువ్వు 
నువ్వు తోప్ ఎహె  అని పంచులు వదిలి 

బుద్ధుల సమ్మెట బాగా  ఎత్తి 
నెత్తిని మొదట గుండెల పిమ్మట 
గొంతుక మీద  గోర్ల వెంబడ 
అలుపెరుగక గురి మరలక దిగిదిగి దిగిదిగి 

మంచిగా చూసే కొడుకుననుకున్నావా 
నేను మేకన్న సంగతే మరిచావా 
దిగితే కానీ తెలియలేదార, అసలు రంగు నలుపని 
కొడుకును కాదు దొంగ నా కొడుకునని 

పిచ్చ  నాయాల ... 

-క మ ర