Wednesday 15 July 2020

తెలివి దివిటి

ఊహతెలిసిన తర్వాత వెతికి వెతికి చూసాను
అమ్మ కొంగనుకొని భ్రమపడి ఏడ్చాను

పరిగెత్తి పరిగెత్తి నాన్న వేలి కోసం
అర్రులు చాచి అలసిపోయాను

అమ్మానాన్న ప్రేమ లేని ఎదవ జీవితం
ఎందుకని పారేయబోతే  వెర్రి స్నేహమొకటి వెనక్కి లాగింది

ఉండదన్న అనుమానం కొండంత ఉన్న
ఉంటేబావుందన్న ఆశ ఊరు దాటింది

చెయ్యివేసి నడిచిన స్నేహం చెయ్యి నరికిన వేళ
చెప్పుదెబ్బల మోము రక్తమోడింది

ప్రేమ అంటూ సాకిన ప్రణయ బంధం
బ్రతుకు ముచ్చట్లతో వేదనాపింది

తెల్లవారుతందని తలచేడంతలో
మరొక బ్రతుకు  బాగుందని మరలిపోయింది

కొడుకు "లాగ " అని చెప్పే లంజకొడుకులందరూ
కోసుకు తిని వదిలేసిపోయారు

తల్లిని అని చెప్పే పుణ్యమాతలెందరో
చాటున మాటేసి వాడేసుకున్నారు

తప్పెవడిది కాదని ఎరుక వచ్చినాక
పిచ్చ నా కొడుకునై మిగిలిపోయాను

మొదలు అంతములు ఒకటే కాగా
మధ్య తీరిన దూల మాడబెట్టింది

దొరకదన్న బాధ దిగమింగి బాగా
లేదన్న రంగు పూసుకున్నాను

ప్రేమ అన్న మాట పూడ్చిపెట్టి
ప్రేమస్వరూపులకు పాడె కట్టాను

బ్రతుకు ఒంటరిదని బుర్ర వెలిగి
తెలివి దివిటి చేతబట్టి   బ్రతకనేర్చాను

-క మ ర

3 comments:

Srikanth Chaganti said...

బాగా దగా పడిన గుండె...
ఏడ్చి ఏడ్చి డస్సి పోయి....
నిరాశ లోంచి పుట్టిన ఉక్రోషంతో ఈ ఎదవ బతుకేంటి అని .... పౌరుషం గా లేచి నిలబడి పోరాడినట్టుంది మావా !!!

Valli said...

Padi lechina keratam nuvvu
Kalmasham leni manishivi nuvvu
Andariki veluguvu panche divvevavi nuvvu


Srini said...

Awesome words deep from heart and experience. Your day will come, you will rise like the Sun giving light to many!