Friday 21 October 2016

నువ్వు చెయ్యలేని మోసము


రంగు  కాగితము కప్పినా రంకు  తనము 
బాగ దాచిపెట్టినా బొంకు తనము 
నిజము నిప్పన్న మాట పెడచెవిన  పెట్టినా 
నీయందు  నిప్పు నిజము నిజము 


నిదురలో  నిను వలుచు 
కలలలో  కడతేర్చు 
లేచి ఉన్నంత వరకు మరచేల మభ్యపెట్టు 


తరగనిదా దూరము 
మరపు రానిదా రూపము 

అద్దమందు నిను చూడనివ్వదు 
నీనుంచి  నిను దాటి పోనియ్యదు 


నీవన్న నిప్పు నిను కాల్చ సాగును 
తలపులమ్మట  తల బద్దలయ్యేను 
కపాల  మోక్షమని పైకి బొంకేవు 
నీ పాపాలకు యమపాశ దెబ్బని తెలిసి ఏడ్చేవు 

చచ్చినాక నిను కాల్చ అగ్గి సిగ్గుపడేను 
నీ అస్థికలు కలుపగా జలము తల్లి ఏడ్చేను  
నీ కుళ్ళు కంపు  మోయ వాయువే వాలేను 
నిను నేను కనలేదని పుడమి అబద్ధమాడేను 
నిను తన కింద చూచి గగనమే చీలేను 


పంచ భూతములను ఏడిపించిన పిచ్చనా కొడుకువై  నీకు నీవు తెలిసి చచ్చేవు 

No comments: