Monday 4 April 2016

"నా"

అమ్మ నాది నాన్న నాది అని మొదలెట్టిన ఆట 
తాత ఎవరిది అనే ఘడియ దగ్గర ముగుస్తోంది 

ఇది నాది అని ఆనందించిన రోజులూ ఉన్నాయి 
"నా " ఎవరు లేరు అని ఏడ్చిన రోజులూ ఉన్నాయి 

వేదాంతం చదివితే "నా   ఆస్తి" అహంకారం అంది 
"నా తోడు " మమకారమంది 
జీవితం చూస్తే "నా ఆస్తి " ప్రేమ అంది 
"నా  తోడు " స్నేహమంది 

పడుకునేలోపు ఏం  గోల చేస్తవులే నేస్తం 
ఇవ్వాళా మూసినా కన్ను ఒక రేపున తెరువలేవు 
ఇవ్వాలి ఆపిన  మాట ఆ రోజు పూర్తి చెయ్యలేవు 
ఆ రోజు తర్వాత విలువలేని ఆస్తులు తీరని అప్పులే నిన్ను గుర్తుకు తెస్తాయి 

ఇదా నా జీవితం,  ఒక రోజు ఇలా ఉంటుంది 
అని తెలిస్తే  ముందు రోజే నవ్వే వాడిని కదా అనిపిస్తుంది 
వీళ్ళకు ఇక నేను లేను అన్న బాధ కంట తడి పెట్టిస్తుంది 
ప్రపంచం నీ గురించి ఏమనుకుందో నీకే ఎరుకకు వస్తుంది 

కాని నాకు తెలుసు నేస్తం  నువ్వు "నా " "నా "
అని ఎందుకన్నావో 
అది మమకారం కాదు ఒంటరితనం అని నాకు తెలుసు 
ఎవరోఒకరు నిన్ను "నా " అంటారన్న  నిరీక్షణ  అని నాకు తెలుసు 

ఎన్ని రాత్రులు లేచావో ఎన్ని  మాటలు దాచావో 
ఎన్ని ఊసులు పేర్చావో ఎంత కన్నీరు కార్చావో 
చూస్తూనే ఉన్నా నేస్తం చూస్తూనే ఉన్నా 
ఎమీ తోచక ఆలోచిస్తున్నా 

నాతో ఈ సహవాసం ఈ క్షణమైనా 
మల్లీ నువ్వు "నా " అని వెతికే  లోపు 
ఒంటరితనాన్ని నాతో పంచుకో నేస్తం 
నన్ను  నా అనుకో నేస్తం ...... 

No comments: