Wednesday 10 May 2017

మనసున దించిన మేకులు

 రంగు రంగుల మేకులు ఎన్నో 
కలిసి వచ్చేది ఎందుకనో 


ఒకటేమో నీలము మరొకటి ఎరుపు 
ఇంకొకటి పసుపు దాని వెనకాలిది పచ్చ 

ఏ మేకు చూసినా  పదునే 
ఏ వైపు చూసినా చదునే 
నమ్మమని అడగవు 
నమ్మేదాకా వదలవు 


ఒడిసి పట్టు కాదనను 
ఆనించి  పెట్టు గుచ్చను
వంచి చూడు బెసకను 
కదిలించి చూడు తొణకను 


సొల్లు మాటలు సాన చెప్పి 
సొల్లు కారుస్తూ వెంటే తిరిగి 
సూపర్ నువ్వు డూపర్ నువ్వు 
నువ్వు తోప్ ఎహె  అని పంచులు వదిలి 

బుద్ధుల సమ్మెట బాగా  ఎత్తి 
నెత్తిని మొదట గుండెల పిమ్మట 
గొంతుక మీద  గోర్ల వెంబడ 
అలుపెరుగక గురి మరలక దిగిదిగి దిగిదిగి 

మంచిగా చూసే కొడుకుననుకున్నావా 
నేను మేకన్న సంగతే మరిచావా 
దిగితే కానీ తెలియలేదార, అసలు రంగు నలుపని 
కొడుకును కాదు దొంగ నా కొడుకునని 

పిచ్చ  నాయాల ... 

-క మ ర 

  

No comments: